హరీష్ రావు ముఖ్యమంత్రి కావాలని పూజలు

Published on Sep 04,2019 10:08 AM

తెలంగాణ ముఖ్యమంత్రిగా తన్నీరు హరీష్ రావు కావాలని కోరుకుంటూ జోగులాంబ గద్వాల జిల్లాలో పూజలు చేసాడు హరీష్ రావు వీరాభిమాని విష్ణు. జోగులాంబ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేకమైన పూజలు చేయడమే కాకుండా 1016 కొబ్బరికాయలు కొట్టి తన కోరిక నెరవేరాలని అమ్మవారిని కోరుకున్నాడు. తెలంగాణలో నియంత పాలన నడుస్తోందని అది అంతమై హరీష్ రావు ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్నాడు. 
సిద్ధిపేట నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న హరీష్ రావు గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసాడు కానీ కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం హరీష్ రావు ని మంత్రివర్గంలోకి తీసుకోలేదు. దాంతో హరీష్ రావు అభిమానులు , తెరాస శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అయితే ఎవరు ఎంతగా కోపంగా ఉన్నా కేసీఆర్ మాత్రం తాను చేయాలనుకున్నదే చేస్తున్నాడు తప్ప మిగతా విమర్శలను లెక్కచేయడం లేదు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంది అందులో నైనా హరీష్ కు తగిన ప్రాధాన్యం లభిస్తుందో ? లేదో ? చూడాలి.