కబడ్డీ ప్లేయర్ గా హాట్ భామ

Published on Feb 25,2019 04:54 PM

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలనం సృష్టించిన భామ పాయల్ రాజ్ పుత్ , ఆ సినిమా ఇచ్చిన ఊపుతో చాలా సినిమాలే వచ్చి పడుతున్నాయి ఈ భామకు . అయితే అన్ని సినిమాలు ఒప్పుకోకుండా జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటోంది . తాజాగా ఈ భామ కబడ్డీ ప్లేయర్ గా నటిస్తోంది . అది కూడా అబ్బాయిలతో అందునా అయిదుగురు అబ్బాయిలతో కలిసి కబడ్డీ ఆడుతోంది .

అందమైన అమ్మాయి , అందాల అమ్మాయి కబడ్డీ ఆడుతుంటే ఆ సొగసు చూడటానికి ఎగబడతాయి కుర్రాళ్ళ కళ్ళు . యువతకు పసందైన విందు ని అందించడానికి కబడ్డీ ప్లేయర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది పాయల్ రాజ్ పుత్ . సీనియర్ హీరోలు వెంకటేష్ , రవితేజ ల సరసన నటించే చాన్స్ రావడంతో సంతోషంగా ఒప్పుకుంది ఈ భామ .