నాగార్జునతో రొమాన్స్ చేయనున్న ఆర్ ఎక్స్ 100 భామ

Published on Feb 01,2019 12:58 PM

కింగ్ నాగార్జున తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది హాట్ భామ పాయల్ రాజ్ పుత్ . ఆర్ ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ భామ బోల్డ్ అవతారం ప్రేక్షకులకు పిచ్చ పిచ్చగా నచ్చింది . ఆర్ ఎక్స్ 100 లో బోల్డ్ సన్నివేశాల్లో మరింత బోల్డ్ గా నటించి దిమ్మ తిరిగేలా చేసింది దాంతో ఈ భామకు అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి . 

తాజాగా కింగ్ నాగార్జున సరసన మన్మథుడు 2 లో నటించే గోల్డెన్ ఛాన్స్ లభించింది పాయల్ రాజ్ పుత్ కు . ఈ భామని ఇటీవలే ఆడిషన్స్ కూడా తీసుకున్నారట . చిలసౌ చిత్రంతో దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్ ఈ మన్మథుడు 2 చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు . నాగార్జున సరసన నటించే ఛాన్స్ అంటే పాయల్ దశ తిరిగినట్లే ! ఇప్పటికే రవితేజ సినిమాలో ఓకే అయ్యింది ఈ భామ .