గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న పాయల్

Published on Apr 18,2020 03:27 PM
ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలన విజయం అందుకొని కుర్రాళ్ళ గుండెల్లో మంటలు రేపిన హాట్ భామ పాయల్ రాజ్ పుత్ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంది. నందమూరి బాలకృష్ణ సరసన నటించే ఛాన్స్ కొద్దిలో మిస్ చేసుకుందట పాయల్ రాజ్ పుత్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన ఒక హీరోయిన్ గా పాయల్ ని అనుకున్నారట ! కానీ ఎక్కడో తేడా కొట్టింది దాంతో ఈ భామని పక్కన పెట్టారట బాలయ్య - బోయపాటి.

ఆర్ ఎక్స్ 100 చిత్రం తర్వాత ఈ భామ పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది కానీ అందులో ఏది కూడా ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయింది. అయితే గుడ్డిలో మెల్ల లాగా వెంకీ మామ చిత్రంలో వెంకటేష్ సరసన నటించింది కానీ అక్కడ సెకండ్ హీరోయిన్ మాదిరి అయిపొయింది. దాంతో ఈ భామ ని సెకండ్ గ్రేడ్ హీరోయిన్ గా భావిస్తున్నారు. కెరీర్ ని సరైన దిశలో ప్లాన్ చేసుకోకపోతే పాయల్ లాగే ఉంటుంది పరిస్థితి.