పాయల్ కు విజయ్ దేవరకొండ బాగా నచ్చాడట

Published on May 02,2020 11:14 AM
హాట్ భామ పాయల్ రాజ్ పుత్ కు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ బాగా నచ్చాడట. నెటిజన్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయం చెప్పింది పాయల్. కరోనా మహమ్మారి వల్ల ఇంట్లోనే ఉంటున్న పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో కొద్దిసేపు ముచ్చటించింది. ఆ సమయంలో టాలీవుడ్ లో ఏ హీరో సరసన నటించాలని ఉందని అడిగితే టక్కున విజయ్ దేవరకొండ పేరు చెప్పేసింది.

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలన విజయం అందుకున్న ఈ భామ ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. అయితే అవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో స్టార్ హీరోల సరసన ఈ భామకు ఛాన్స్ రావడం లేదు. మరి విజయ్ దేవరకొండ ఈ భామకు ఛాన్స్ ఇస్తాడా ? అన్నది చూడాలి. ఆర్ ఎక్స్ 100 చిత్రానికి సీక్వెల్ చేసే ఆలోచన చేస్తున్నాడు అజయ్ భూపతి మరి ఆ సినిమాలోనైనా పాయల్ ని తీసుకుంటారా ?