ఒంటికి న్యూస్ పేపర్ చుట్టుకున్న పాయల్

Published on Apr 23,2020 04:53 PM
హాట్ భామ పాయల్ రాజ్ పుత్ ఒంటికి న్యూస్ పేపర్ చుట్టుకొని అలాగే ఫోటోలకు ఫోజిచ్చింది. అంతేనా ఆ న్యూస్ పేపర్ చుట్టుకొని దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరింత రచ్చ చేస్తోంది. పాయల్ రాజ్ పుత్ లోని క్రియేటివిటీ చూసి నెటిజన్లు కొందరు మెచ్చుకుంటుంటే మరికొంతమంది ఏమో తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు పాయల్ ని. న్యూస్ పేపర్ ని స్టైల్ గా డిజైన్ చేసి కిందా మీద అడ్డుగా పెట్టుకుంది.

ఒంటి మీద బట్టలు లేకుండా ఇలా చేయడంతో పాయల్ అందాలను ఆస్వాదించే వాళ్ళు ఆస్వాదిస్తున్నారు అలాగే విమర్శించే వాళ్ళు విమర్శిస్తున్నారు. అహనా పెళ్ళంటా చిత్రంలో ఓ సన్నివేశంలో రాజేంద్రప్రసాద్ ఇలా న్యూస్ పేపర్ ని లుంగీ గా చుట్టుకుంటాడు కట్ చేస్తే ఇన్నాళ్లకు ఆ పని చేసింది పాయల్ దాంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్ ఎక్స్ 100 చిత్రంతో సంచలనం సృష్టించిన ఈ భామ ఆ తర్వాత ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది.