పవన్ కళ్యాణ్- క్రిష్ కాంబినేషన్ లో సినిమా ?

Published on Oct 29,2019 04:01 PM
జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టి సినిమాలకు దూరమైన పవన్ కళ్యాణ్ మళ్ళీ ముఖానికి రంగు వేసుకోవడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. విభిన్న కథా చిత్రాల దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో నటించడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారట. అప్పటి వరకు ఇలా సస్పెన్స్ కొనసాగనుంది.

రియల్ ఇన్సిడెంట్ల నేపథ్యంలో క్రిష్ రాసిన కథ పవన్ కళ్యాణ్ కు బాగా నచ్చిందట. అయితే ఇంకా పక్కాగా ఓకే చేయలేదట. త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ అంటే బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం. అజ్ఞాతవాసి డిజాస్టర్ అయ్యాక పవన్ కళ్యాణ్ మళ్ళీ నటించలేదు, తన దృష్టి అంతా రాజకీయాల మీదే పెట్టాడు.