పవన్ కళ్యాణ్ కథలు వింటున్నాడట

Published on Oct 28,2019 05:59 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు దూరం కావడంతో పవర్ స్టార్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు అయితే పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు అబ్బాయ్ రాంచరణ్ తేజ్. పవన్ కళ్యాణ్ బాబాయ్ కథలు వింటున్నాడని కాకపోతే ఇంకా సినిమాలు చేయాలా ? లేదా ? అన్నది ఇంకా డిసైడ్ చేసుకోలేదని అన్నాడు చరణ్. కథలు వింటున్నాడు అంటే తప్పకుండా సినిమాల్లో మళ్ళీ నటించడం ఖాయమే అన్నమాట.

జనసేన అనే రాజకీయ పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసి ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. దాంతో షాక్ అయిన పవన్ మళ్ళీ సినిమాల మీద దృష్టి పెడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ ఎన్నికలకు ఇంకా నాలుగున్నర సంవత్సరాల సమయం ఉంది కాబట్టి ఈలోపు సినిమాల్లో నటించడం ఖాయంగా కనిపిస్తోంది.