ఫేడౌట్ హీరోయిన్ తో పవన్ కళ్యాణ్

Published on Feb 11,2020 02:43 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా రెండు చిత్రాల్లో నటిస్తూ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. అయితే అంత జోష్ లో ఉన్న ఈ హీరోకు హీరోయిన్ మాత్రం ఓ ఫేడౌట్ భామని ఎంపిక చేయడం సంచలనంగా మారింది. దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రంతో పాటుగా క్రిష్ దర్శకత్వంలో ఏ ఎం రత్నం నిర్మిస్తున్న చిత్రం లో కూడా పవన్ నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా క్రిష్ - పవన్ ల సినిమాలో హీరోయిన్ గా మొదట కియారా అద్వానీని తీసుకోవాలని అనుకున్నారు అయితే ఆ భామ ఝలక్ ఇచ్చింది దాంతో వాణీకపూర్ ని ఎంపిక చేశారట.

వాణీకపూర్ కూడా బాలీవుడ్ భామే ! తెలుగులో నాని హీరోగా నటించిన '' ఆహా కళ్యాణం '' చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆహా కళ్యాణం తెలుగులో అట్టర్ ప్లాప్ అయ్యింది దాంతో ఈ భామకు ఛాన్స్ లు ఇవ్వలేదు ఎవరూ. కట్ చేస్తే ఇన్నాళ్లకు మళ్ళీ సినిమా వచ్చింది అది కూడా తెలుగులో. పవన్ కళ్యాణ్ తో రొమాన్స్ చేసే లక్కీ ఛాన్స్ కొట్టేసింది వాణీకపూర్. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గజదొంగ గా నటిస్తున్నట్లు సమాచారం. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోంది ఈ చిత్రం.