పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించేది కష్టమే

Published on Sep 03,2019 01:42 PM

సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వెళ్లిన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లో నటించడం కష్టమే అని తేల్చేసారు జనసేన పార్టీ ప్రతినిధులు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన ఘోర పరాజయం పొందడంతో ఇక పవన్ కళ్యాణ్ కు వేరే పని ఉండదు కాబట్టి రాజకీయాలకు కొంతకాలం స్వస్తి చెప్పి మళ్ళీ సినిమాల్లో నటిస్తాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. 
అయితే ఆ ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ సన్నిహితులు. తాజాగా జనసేన పార్టీ కార్యాలయం కూడా ఈమేరకు ప్రకటన విడుదల చేయడంతో ఇక పవన్ కళ్యాణ్ వెండితెర మీద కనిపించడం కష్టమే అని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో రాజకీయంగా పట్టు సాధించాలన్న పట్టుదలతో ఉన్నాడట పవన్ కళ్యాణ్. అందుకే సినిమాల్లో నటించడు అని అంటున్నారు.