పవన్ కళ్యాణ్ కొడుకు హీరోగా వస్తున్నాడు !

Published on Feb 13,2020 11:45 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ కూడా హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. యుక్త వయసులో ఉన్న అకిరా నందన్ ఇన్నాళ్లు తల్లితో కలిసి పూణే లో ఉంటున్నాడు అయితే అడపా దడపా హైదరాబాద్ వచ్చి వెళ్తున్నాడు అకిరా నందన్. తాజాగా అకిరా నందన్ తన మకాం పూర్తిగా హైదరాబాద్ కు మారుస్తున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తన కొడుకు అకిరా నందన్ , కూతురు ఆద్య ల కోసం అధునాతనమైన విల్లా కొన్నట్లుగా తెలుస్తోంది.

ఆ విల్లా లోనే అకిరా నందన్ , ఆద్య లతో కలిసి రేణు దేశాయ్ ఉండనుందట. పిల్లలు ఇద్దరు కూడా తల్లి రేణు దేశాయ్ తోనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక రేణు దేశాయ్ కూడా రకరకాల కార్యక్రమాల కోసం హైదరాబాద్ వచ్చి వెళుతోంది దాంతో పిల్లలకు ఇబ్బంది కాబట్టి పూణే నుండి హైదరాబాద్ కు మకాం మార్చుతున్నట్లు తెలుస్తోంది. తల్లిదండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తూ అకిరా నందన్ కూడా హీరోగా పరిచయం కానున్నట్లు తెలుస్తోంది.