క్యూ కడుతున్న వాళ్లకు షాక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

Published on Apr 14,2020 02:03 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయాలనీ పలువురు దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. అయితే అలాంటి వాళ్లకు షాక్ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పట్లో కొత్త సినిమాలు ఏవి ఒప్పుకోనని , ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ అయ్యాకే కొత్త సినిమాలు అంగీకరిస్తామని కుండబద్దలు కొట్టి మరీ చెబుతున్నాడట దాంతో పవన్ కళ్యాణ్ తో సినిమాలు తీయాలని ఉత్సాహపడేవాళ్ళకు తీవ్ర నిరాశ ఎదురు అవుతోందట.

పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే చాలు ఎంత రెమ్యునరేషన్ అయినా ఇవ్వడానికి సిద్ధం అంటూ వస్తున్న వాళ్లకు షాక్ ఇచ్చేలా ఉంది పవన్ కళ్యాణ్ నిర్ణయం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడు సినిమాలను లైన్లో పెట్టాడు. వకీల్ సాబ్ చిత్రం దాదాపుగా పూర్తి కాగా క్రిష్ సినిమా సెట్స్ మీదుంది. ఇక హరీష్ శంకర్ సినిమా ఈ ఏడాది ఆఖరులో లేదా వచ్చే ఏడాదిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. దాంతో ఆ సినిమాల షెడ్యూల్స్ సెట్ అయ్యాకే కొత్త సినిమాలు అంగీకరించాలని అనుకుంటున్నాడట పవన్ కళ్యాణ్