చిరు చరణ్ లపై పొగడ్తల వర్షం కురిపించిన పవన్

Published on Aug 22,2019 03:23 PM

అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి , అబ్బాయ్ రాంచరణ్ ల పై పొగడ్తల వర్షం కురిపించాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ . అన్నయ్య ని ఎలాంటి సినిమాలో చూడాలని నేను ఆశపడుతున్నానో సరిగ్గా అలంటి సినిమాయే చేసాడు అన్నయ్య , అలాగే సైరా లాంటి గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడి చిత్రాన్ని రాంచరణ్ నిర్మించడం విశేషం . నేను చేయలేని పనిని రాంచరణ్ చేస్తున్నాడు అందుకు చాలా సంతోషంగా ఉందన్నారు పవన్ . 
నిన్న రాత్రి హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో భారీ ఎత్తున జరిగిన చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పవన్ కళ్యాణ్ తో పాటుగా మెగా హీరోలు , మెగా అభిమానులు పాల్గొన్నారు దాంతో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు పూనకం వచ్చేలా చేసాడు . ఇక అన్నయ్య చిరంజీవి తన జీవిత గమనాన్ని మార్చాడని , తండ్రి లాంటి వాడని అంటున్నాడు .