పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ వకీల్ సాబ్

Published on Feb 06,2020 10:12 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా పింక్ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ గా నటిస్తుండటంతో లాయర్ సాబ్ అనే టైటిల్ పెట్టనున్నట్లు కథనాలు వచ్చాయి కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం '' వకీల్ సాబ్ '' అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. లాయర్ సాబ్ అన్నా వకీల్ సాబ్ అన్నా ఒకటే అయితే గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ వకీల్ సాబ్ అనే ఎక్కువగా పిలుస్తారు లాయర్ లను.

పవన్ కళ్యాణ్ లాయర్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మే 15 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు దిల్ రాజు. గబ్బర్ సింగ్ చిత్రం మే 11 న విడుదల కావడంతో ఆ సెంటిమెంట్ ని ఫాలో అవుతూ వకీల్ సాబ్ చిత్రాన్ని మే 15 న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దిల్ రాజు. బాలీవుడ్ లో పింక్ సంచలన విజయం సాధించింది. ఇక తెలుగులో బాగానే మార్పులు చేశారట పవన్ కళ్యాణ్ కోసం.