మే 15 న విడుదల కానున్న పవన్ కళ్యాణ్ చిత్రం

Published on Feb 03,2020 06:33 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న లాయర్ సాబ్ చిత్రాన్ని మే 15 న విడుదల చేయనున్నారు. పింక్ రీమేక్ గా తెరకెక్కుతున్న లాయర్ సాబ్ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా గబ్బర్ సింగ్ మే 11 న విడుదలై సంచలన విజయం సాధించడంతో ఆ సెంటిమెంట్ ని ఫాలో అవుతూ మే 15 న లాయర్ సాబ్ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఉగాది రోజున ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేయనున్నారు. అలాగే మే 15 న సినిమా విడుదల చేయనున్నారు. పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మించాలని దిల్ రాజు గత 15 ఏళ్లుగా తహతహలాడుతున్నాడు కానీ అది ఇన్నాళ్లకు పింక్ రీమేక్ ద్వారా కుదిరింది. ఇక ఈ సినిమాలో కొన్ని మార్పులు చేశారట , ఆ మార్పులు పవన్ ఫ్యాన్స్ ని విపరీతంగా అలరిస్తాయని తప్పకుండా బ్లాక్ బస్టర్ కొడతానని అంటున్నాడు దిల్ రాజు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా నివేదా థామస్ , అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.