మే 22 న విడుదల కానున్న పవన్ కళ్యాణ్ కొత్త సినిమా

Published on Jan 25,2020 08:15 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఏంటి ? అప్పుడే రిలీజ్ డేట్ ఏంటి ? అని షాక్ అవుతున్నారా ? తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న పింక్ రీమేక్ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేసి మే 14 లేదా మే 22 న విడుదల చేయాలనీ డిసైడ్ అయ్యారట నిర్మాత దిల్ రాజు. అమితాబ్ బచ్చన్ , తాప్సీ నటించిన పింక్ చిత్రాన్ని తెలుగులో లాయర్ సాబ్ గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నివేదా థామస్ , అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ లాయర్ గా నటిస్తున్నాడు ఈ చిత్రంలో. అమితాబ్ పోషించిన పాత్రకు స్వల్ప మార్పులు చేసారు పవన్ కళ్యాణ్ కోసం. ఇక ఈ సినిమా కోసం పవన్ కేవలం 20 రోజుల నుండి 25 రోజుల కాల్షీట్స్ మాత్రమే ఇచ్చాడట. తన పాత్ర నిడివి తక్కువ కాబట్టి అందునా పాటలు ఉండే చిత్రం కాదు కాబట్టి శరవేగంగా కంప్లీట్ చేయాలనీ చెప్పాడట. అందుకే మేలో విడుదల చేయాలనీ డిసైడ్ అయ్యారట దిల్ రాజు. ఇక ఈ సినిమాకు బోనికపూర్ కూడా ఒక నిర్మాత కావడం విశేషం.