పవన్ కళ్యాణ్ లీక్డ్ పిక్ వైరల్

Published on Mar 15,2020 06:17 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిక్ ఒకటి లీక్ అయ్యింది అది ఇక సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాజాగా పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. బందిపోటు గా పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రిష్ చిత్రంలో. పీరియాడికల్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ కూడా బాగానే అవుతోంది. అయితే క్రిష్ దర్శకుడు కాబట్టి చాలా పొదుపుగా ఖర్చు పెడుతూ 100 కోట్ల నుండి 120 కోట్లు అయ్యేలా చేస్తున్నాడట.

ఇక తాజా పిక్ విషయానికి వస్తే ...... క్రిష్ సినిమా షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్న సమయంలో దొంగచాటుగా పవన్ ని ఫోటో తీసిన వాళ్ళు ఆగకుండా దాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అవుతోంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ లుక్ ఫ్యాన్స్ ని అదిరిపోయేలా చేస్తోంది. కోర మీసంతో ఉన్న పవన్ ఆకై గొన్న పులిలా ఉన్నాడు. ఒకవైపు వకీల్ సాబ్ షూటింగ్ లో పాల్గొంటూనే మరోవైపు క్రిష్ సినిమాలో కూడా పాల్గొంటున్నాడు పవన్ కళ్యాణ్.