అభిమానికి ఆర్ధికసాయం అందించిన పవన్ కళ్యాణ్

Published on Aug 22,2019 04:00 PM

క్యాన్సర్ తో పోరాడుతున్న అభిమానికి లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందించాడు పవన్ కళ్యాణ్ . గత ఎన్నికల్లో జనసేన రాజకీయ పార్టీ తరుపున పెద్ద ఎత్తున ప్రచారం చేసిన బూడిగయ్య అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని . దాంతో జనసేన తరుపున ప్రకాశం జిల్లాలో బాగానే కష్టపడి ప్రచారం చేసాడట . అయితే ఇటీవల తీవ్ర అనారోగ్యం సోకడంతో క్యాన్సర్ బారిన పడ్డాడని తెలిసింది . 

దాంతో తన ఆరోగ్యం క్షీణించే ముందు తన అభిమాన హీరో అయిన పవన్ కళ్యాణ్ ని చూడాలని ఆశపడ్డాడట ! ఈ విషయం పవన్ కళ్యాణ్ కు తెలియడంతో తన అభిమానిని పరామర్శించడమే కాకుండా లక్ష రూపాయల ఆర్ధిక సహాయం అందించాడు . బూడిగయ్య ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు . తన అభిమాన హీరోని చూసాను అనే సంతోషం లో ఉన్నాడు ఆ అభిమాని .