హస్తినకు వెళ్లిన పవన్ కళ్యాణ్

Published on Mar 08,2020 05:51 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు జనసేన కార్యక్రమాలను చక్కబెడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో పొత్తుల కోసం హస్తినకు వెళ్ళాడు పవన్ కళ్యాణ్. బీజేపీ పెద్దలతో కలిసి చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ స్థానిక ఎన్నికల్లో పొత్తుల కోసమే చర్చించామని తెలిపారు.

బీజేపీ అగ్రనాయకులతో చర్చించిన పవన్ తిరిగి ఏపీ కి వచ్చాక రాష్ట్ర నాయకులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారట పొత్తుల విషయంలో. ఏపీలో స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో జగన్ కు షాక్ ఇచ్చేలా ఫలితాలు సాధించాలని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ . జనసేన ఆశించిన స్థాయిలో పుంజుకోలేదు అలాగే భారతీయ జనతా పార్టీ కూడా దాంతో ఇద్దరు కలిసి జగన్ ప్రభుత్వం పై పోరాటం చేయాలనీ ఈ నిర్ణయం తీసుకున్నారు.