దిల్ రాజు పై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్

Published on Jan 24,2020 09:52 PM

పవన్ కళ్యాణ్ అగ్ర నిర్మాత దిల్ రాజు పై ఆగ్రహం వ్యక్తం చేసాడట. పింక్ రీమేక్ చిత్రంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ పింక్ రీమేక్ షూటింగ్ హైదరాబాద్ లో జరిగింది కాగా ఆ షూటింగ్ లో పవన్ కళ్యాణ్ ఒకరోజు పాల్గొన్నాడు. పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొన్న సమయంలో ఎవరో ఫోటో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. ఇంకేముంది ఈ విషయం పవన్ చెవిన పడటంతో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని దిల్ రాజుని ఆదేశించాడట పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు సినిమాలు కూడా చేయడానికి రెడీ అయ్యాడు. బాలీవుడ్ లో విజయం సాధించిన పింక్ చిత్రాన్ని తెలుగులో లాయర్ సాబ్ గా చేస్తున్నాడు అలాగే క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. క్రిష్ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు.