సుధాకర్ ని ఒరేయ్ అని అనడానికి పవన్ ఇబ్బంది పడ్డాడట

Published on May 02,2020 11:35 AM
కమెడియన్ సుధాకర్ ని ఒరేయ్ అనడానికి చాలా ఇబ్బంది పడ్డాడట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సుధాకర్ మెగాస్టార్ చిరంజీవికి చాలా క్లోజ్ ఫ్రెండ్. దాంతో ఆ స్నేహం కొద్దీ పవన్ కళ్యాణ్ కు బాగా చనువు ఉండేదట ! అయితే తనకంటే పెద్దవాడు పైగా అన్నయ్యకు మంచి స్నేహితుడు కావడంతో సుధాకర్ ని సినిమాలో ఒరేయ్ అని అనడానికి చాలా చాలా ఇబ్బంది పడ్డాడట పవన్ కళ్యాణ్ దాంతో అతడి ఇబ్బందిని గమనించిన సుధాకర్ పవన్ దగ్గరకు వెళ్లి నువ్వు ఒరేయ్ అని అనేది నన్ను కాదు సినిమాలోని పాత్రని కాబట్టి మొహమాటపడకు అనేసెయ్ అని అభయం ఇచ్చాడట.

అప్పట్లో సుధాకర్ చాలా ఫేమస్. హాస్య నటుడిగా , విలన్ గా కామెడీ విలన్ గా పలు చిత్రాల్లో నటించాడు. అలాగే అంతకుముందు హీరోగా కూడా నటించాడు. చిరంజీవికి ఫ్రెండ్ కాబట్టి తరచుగా ఒకరి ఇంటికి మరొకరు వచ్చిపోతుండేవాళ్లు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన గోకులంలో సీత , సుస్వాగతం చిత్రాల్లో సుధాకర్ నటించాడు. అప్పట్లో పవన్ కళ్యాణ్ కు బాగా మొహమాటం ఉండేదట. ఈ విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు సుధాకర్.