అత్తారింటికి వెళ్లిన పవన్ కళ్యాణ్

Published on Dec 26,2019 01:58 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిస్మస్ వేడుకల కోసం రష్యా వెళ్ళాడు కుటుంబ సమేతంగా. జనసేన పార్టీ కార్యక్రమాలతో నిత్యం బిజీ గా ఉండే పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాలను పక్కన పెట్టి కొద్దిరోజులు ఎంజాయ్ చేయడానికి అలాగే క్రిస్మస్ వేడుకల కోసం తన భార్యా పిల్లలతో రష్యా వెళ్ళాడు. పవన్ కళ్యాణ్  అన్నా లెజ్ నోవా ని ప్రేమించి పెళ్లి చేసుకున్నవిషయం తెలిసిందే. పవన్ - అన్నా లకు ఇద్దరు సంతానం ఒక అమ్మాయి ,ఒక అబ్బాయి కాగా వాళ్ళని తీసుకొని సతీసమేతంగా రష్యా వెళ్లినట్లు తెలుస్తోంది.

అన్నా లెజ్ నోవా రష్యా దేశానికి చెందిన యువతి అన్న విషయం తెలిసిందే. తీన్ మార్ సినిమాలో నటించే సమయంలో అన్నా లెజ్ నోవా తో ప్రేమాయణం సాగించాడు పవన్. ఆ తర్వాత రేణు దేశాయ్ కి విడాకులు ఇచ్చి అన్నా లెజ్ నోవా ని పెళ్లి చేసుకున్నాడు. రేణు దేశాయ్ - పవన్ లకు కూడా ఇద్దరు సంతానం. ఒకరు అబ్బాయి కాగా మరొకరు అమ్మాయి. మొత్తంగా పవన్ కళ్యాణ్ కు నలుగురు సంతానం. క్రిస్మస్ వేడుకలతో పాటుగా న్యూ ఇయర్ వేడుకలను కూడా జరుపుకొని ఆ తర్వాత ఇండియాకు రానున్నాడు పవన్ కళ్యాణ్.