జార్జ్ రెడ్డి ప్రీ రిలీజ్ వేడుకకు గెస్ట్ గా పవన్ కళ్యాణ్

Published on Nov 12,2019 11:08 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జార్జ్ రెడ్డి అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నాడు. ఉస్మానియా స్టూడెంట్ జార్జ్ రెడ్డి అంటే అప్పట్లో సంచలనమే ! అణగారిన వర్గాల కోసం అరివీర భయంకరంగా పోరాడిన యోధుడు జార్జ్ రెడ్డి. హైదరాబాద్ లోని ఉస్మానియా  యూనివర్సిటీ ముందే 1972 లో ఏప్రిల్ 14 న దారుణ హత్యకు గురయ్యాడు జార్జ్ రెడ్డి. ఈ పోరాట యోధుడి కథాంశంతో తెరకెక్కుతున్న జార్జ్ రెడ్డి ఈనెల 22 న విడుదలకు సిద్ధమైంది.

దాంతో ఈనెల 17 న హైదరాబాద్ లో జార్జ్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేస్తున్నారు. కాగా ఆ వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అథితిగా హాజరు కానున్నాడు. జార్జ్ రెడ్డి అంటే పవన్ కళ్యాణ్ కు కూడా అమితమైన ఇష్టం అందుకే ఈ వేడుకకు వస్తున్నాడు పవన్. జార్జ్ రెడ్డి బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ట్రైలర్ విశేష ఆదరణ పొందుతోంది. ఇక సినిమా సంగతి ఏంటి అన్నది ఈనెల 22 న తేలనుంది.