తమ్మారెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పవన్ ఫ్యాన్స్

Published on Nov 25,2019 11:55 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పింది చేయడు , ట్వీట్ లకు మాత్రమే పరిమితం అవుతాడు అతడికి జార్జి రెడ్డి కి పోలిక ఏంటి ? అని విమర్శించడమే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు కోపం రావడానికి కారణం అయ్యింది. ఉస్మానియా స్టూడెంట్ లీడర్ జార్జి రెడ్డి అంటే పవన్ కళ్యాణ్ కు విపరీతమైన అభిమానం దాంతో జార్జి రెడ్డి పాత్ర ని పవన్ కళ్యాణ్ చేస్తే అన్న టాక్ కూడా వచ్చింది.

దాంతో తీవ్రంగా స్పందించాడు తమ్మారెడ్డి , జార్జి రెడ్డి చెప్పింది చేస్తాడని ...... అనుకున్న దాని కోసం ఎంతకైనా తెగించే తత్వం అని అలాంటిది అతడ్ని పవన్ కళ్యాణ్ తో పోల్చవద్దని చెప్పాడం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పించింది. అందుకే తమ్మారెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మొదటి నుండి పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా విమర్శిస్తూనే ఉన్నాడు.