బూతు చిత్రానికి సూపర్ ఓపెనింగ్స్

Published on Dec 09,2019 12:32 PM

పతి పత్ని ఔర్ వోహ్ అనే బూతు చిత్రానికి మంచి ఓపెనింగ్స్ లభించాయి. కార్తీక్ ఆర్యన్ , భూమిక పెడ్నేకర్ , అనన్య పాండే లు నటించిన అడల్ట్ కామెడీ చిత్రం '' పతి పత్ని ఔర్ వోహ్ '' డిసెంబర్ 6 న విడుదల అయ్యింది. ఇక ఈ సినిమా విడుదల కాకముందే మంచి అంచనాలు ఏర్పడ్డాయి టీజర్ , ట్రైలర్ ల వల్ల. సినిమా బూతు కంటెంట్ తో తెరకెక్కడంతో యువత బాగానే ఆదరిస్తున్నారు.

ఇక ఈ సినిమాకు ఫస్ట్ డే 9 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. చిన్న చిత్రానికి 9 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయంటే అందుకు కారణం బూతు సినిమా కావడమే.బాలీవుడ్ లో ఒకవైపు మంచి చిత్రాలు వస్తూనే ఉన్నాయి కానీ అదే సమయంలో ఇలాంటి బూతు చిత్రాలు కూడా బాగానే వస్తున్నాయి. అడల్ట్ కంటెంట్ తో వస్తున్న చిత్రాలకు కుర్రాళ్ళ ఆదరణ లభిస్తోంది దాంతో మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇక నిన్న ఆదివారం కావడంతో కూడా ఈ సినిమాకు కలిసి వచ్చింది.