పండుగాడు సినిమా

Published on Sep 13,2019 01:07 PM

ఈ నెల లో  వస్తున్న'' పండుగాడు'. శ్రీ వెంకటేశ్వర విద్యాలయమ్స్ ఆర్ట్స్ పతాకం పై అలీ ,రిషిత (భవ్యశ్రీ )జంటగా బాబూమోహన్ ,వినోద్కుమార్ ,జీవ ,సుధా ,చిత్రం శీను ,శ్రీలక్ష్మి మొదలగు భారీ తారాగణం తో గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన చిత్రం 'పండుగాడి ఫోటో స్టూడియో ''. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రo ఇదే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నది .కుటుం సమేతంగా చూడదగ్గ పూర్తి స్థాయీ కామెడీ ఎంటర్ టైనర్గా దర్శకుడు దిలీప్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు .ఈ చిత్రంలో అలీ ఎవరికి ఫోటో తీసినా వారికి వెంటనే వివాహం నిశ్చయం అయ్యే ప్రధాన అంశం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది .చక్కటి పాటలు ,అద్భుతమైన ఫైట్స్ తో అలీ ప్రేక్షకులను అలరిస్తారు .తమ మొదటి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే ఆశాభావాన్ని నిర్మాత గుది బండి వెంకట సాంబిరెడ్డి ఒక ప్రకటనలో తెలియ జేశారు .
సంగీతం -యాజమాన్య ,
కెమెరా -మురళీ మోహన్ రెడ్డి .
పాటలు-శ్రేయా ఘోషల్ ,మనీషా ఎర్రబత్తిని ,వినోద్ యాజమాన్య . మొదలగు వారు .
ఎడిటింగ్ -నందమూరి హరి .
కదా,మాటలు,స్క్రీన్ప్లే ,దర్శకత్వం ;దిలీప్ రాజా .
నిర్మాత -గుదిబండి వెంకట సాంబిరెడ్డి .