`ఒరేయ్ ...బుజ్జిగా`

Published on Nov 15,2019 05:20 PM

ఏమైంది ఈ వేళ‌`, `అధినేత‌`, `బెంగాల్ టైగ‌ర్‌`, `పంతం` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌ను నిర్మించి రీసెంట్‌గా కార్తి `ఖైదీ` చిత్రాన్ని తెలుగులో స‌మ‌ర్పించి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ అందుకున్నారు శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధా మోహ‌న్. ప్ర‌స్తుతం రాజ్‌త‌రుణ్‌, మాళ‌వికా నాయ‌ర్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ కె.కె. రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై  `గుండె జారి గల్లంతయ్యిందే', 'ఒక లైలా కోసం` వంటి రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్స్‌ను అందించిన దర్శకుడు కొండా విజ‌య్‌కుమార్  తెరక్కిస్తున్న చిత్రం. `ఒరేయ్ బుజ్జిగా`. ప్రస్తుతం  ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఇందులో ఓ కీలక పాత్ర‌లో `కుమారి 21 ఎఫ్‌` ఫేమ్ హెబ్బా ప‌టేల్ న‌టిస్తున్నారు. తాజా షెడ్యూల్‌లో  ఈరోజు నుండి నుండి హెబ్బా ప‌టేల్ యూనిట్‌తో జాయిన్ అయ్యారు. ఆమెపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా..

చిత్ర‌ నిర్మాత కె.కె.రాధామోహన్‌ మాట్లాడుతూ - ``మా బ్యాన‌ర్‌లో రూపొందుతోన్న `ఒరేయ్ బుజ్జిగా` షూటింగ్ అనుకున్న ప్లానింగ్ ప్ర‌కారం జ‌రుగుతుంది. రాజ్‌త‌రుణ్ స‌ర‌స‌న మాళ‌వికా నాయ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా   కీల‌క‌మైన పాత్ర‌లో `కుమారి 21 ఎఫ్‌` చిత్రంతో యూత్‌కి ద‌గ్గ‌రైన హీరోయిన్ హెబ్బా ప‌టేల్ న‌టిస్తున్నారు. మాళ‌వికా, హెబ్బా ప‌టేల్ ఇద్ద‌రి పాత్ర‌ల‌కు  ఇంపార్టెన్స్ ఉంటుంది.  ఈ సంద‌ర్భంగా క‌థ న‌చ్చి సినిమా చేయ‌డానికి ఒప్పుకున్న హెబ్బాప‌టేల్‌కు థ్యాంక్స్‌. సినిమాను ఎంట‌ర్‌టైనింగ్‌గా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా ద‌ర్శ‌కుడు కొండా విజ‌య్‌కుమార్  తెర‌కెక్కిస్తున్నారు`` అన్నారు.