ఇంకో ట్రీట్ ఇవ్వనున్న పవన్ కళ్యాణ్

Published on Mar 05,2020 02:45 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీలో అదరగొడుతున్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ విడుదల చేసి ఫ్యాన్స్ ని ఖుషీ చేసిన పవన్ మళ్ళీ ఇంకో ట్రీట్ ఇవ్వనున్నాడు. వకీల్ సాబ్ తో పాటుగా క్రిష్ దర్శకత్వంలో కూడా పవన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆ సినిమా కూడా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఆ సినిమా ఫస్ట్ లుక్ ని ఎప్పుడు విడుదల చేయనున్నారో రివీల్ చేసారు. ఇంతకీ ఆ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యేది ఎప్పుడో తెలుసా ...... సెప్టెంబర్ 2 న.

సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని క్రిష్ - పవన్ ల సినిమా ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ఇక దసరా కు ఈ సినిమాని విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. వకీల్ సాబ్ ఎలాగూ మే 15 న విడుదల అవుతోంది. అంటే మధ్యలో నాలుగు నెలల గ్యాప్ అన్నమాట. ఈ ఒక్క ఏడాదిలోనే పవన్ కళ్యాణ్ నటించిన రెండు సినిమాలు విడుదల కానున్నాయి. ఒకే ఏడాదిలో 2 సినిమాలు అంటే పవన్ ఫ్యాన్స్ సంతోషాన్ని మాటల్లో చెప్పగలమా !