విజయ్ దేవరకొండపై మళ్ళీ ఆగ్రహం

Published on Apr 18,2020 03:47 PM
హీరో విజయ్ దేవరకొండ పై మళ్ళీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఇంతకుముందు కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండటంతో అందరు హీరోలు విరాళాలు ఇచ్చారు కానీ విజయ్ దేవరకొండ మాత్రం విరాళం ప్రకటించలేదు దాంతో అతడి పై విమర్శలు చేసారు. కట్ చేస్తే ఇప్పుడేమో పోలీసులకు జ్యూస్ ప్యాకెట్లు ఇస్తుండటంతో మరోసారి విమర్శల పాలయ్యాడు.

జ్యూస్ ప్యాకెట్లు ఇస్తే మంచిదేగా అందులో విమర్శలు ఎందుకు అని అనుకుంటున్నారా ? హీరో విజయ్ దేవరకొండ ఒక చోట నిలబడి జ్యూస్ ప్యాకెట్లు ఇస్తుంటే పోలీస్ అధికారులు ఒక్కొక్కరుగా వస్తూ ఆ ప్యాకెట్లను అందుకుంటున్నారు. ఈ వీడియో చూసి కొంతమంది సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండని విమర్శిస్తూ పోస్ట్ లు పెట్టారు. అంతేకాదు తెలంగాణ డీజీపీ తో పాటుగా ఐటీ శాఖామంత్రి కేటీఆర్ కు కూడా ట్యాగ్ చేసారు. విజయ్ దేవరకొండ రీల్ హీరో పోలీసులు రియల్ హీరోలు అలాంటి వాళ్ళకు ఇదా మర్యాద అని మండిపడుతున్నారు.