మరోసారి తండ్రైన అర్జున్ రెడ్డి డైరెక్టర్

Published on Feb 28,2020 03:18 PM

అర్జున్ రెడ్డి చిత్రంతో తెలుగునాట సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా మరోసారి తండ్రి అయ్యాడు. ఇంతకుముందు తనకు ఒక కొడుకు పుట్టగా అతడికి అర్జున్ రెడ్డి అని పేరు పెట్టుకున్నాడు. కాగా ఇప్పుడేమో కూతురు పుట్టింది. దాంతో సందీప్ రెడ్డి ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తోంది. 2014 లో మనీషా రెడ్డి ని పెళ్లి చేసుకున్నాడు సందీప్ రెడ్డి వంగా. ఆమె ఈరోజు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఒక కొడుకు ఆ తర్వాత ఒక కూతురు పుట్టడంతో చాలా సంతోషంగా ఉన్నారు.

అర్జున్ రెడ్డి చిత్రంతో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా అదే చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేయగా అది అక్కడ బ్లాక్ బస్టర్ అయ్యింది దాంతో అగ్రశ్రేణి దర్శకుల జాబితాలో చేరిపోయాడు సందీప్ రెడ్డి వంగా. ఇక ఇప్పుడేమో మరో అడల్ట్ క్రైమ్ స్టోరీకి రూపకల్పన చేస్తున్నాడు. ఇదే సమయంలో కూతురు పుట్టడంతో సందీప్ సంతోషానికి అవధులు లేకుండాపోయాయి.