టాలీవుడ్ లో మరో విషాదం

Published on Feb 18,2020 07:35 PM

టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. మొన్ననే హీరో  శ్రీకాంత్ తండ్రి చనిపోగా ఈరోజు దర్శకులు వీరశంకర్ తండ్రి మరణించాడు. పవన్ కళ్యాణ్ తో గుడుంబా శంకర్ వంటి చిత్రాన్నీ చేసాడు దర్శకులు వీరశంకర్. ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ లోని తణుకు సమీపంలోగల చివటం గ్రామంలో వీరశంకర్ తండ్రి బైరిశెట్టి సత్యనారాయణ (83) చనిపోయాడు. గతకొంత కాలంగా సత్యనారాయణ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు.

మాకు నిజాయితిని , కష్టపడే తత్వాన్ని నేర్పించిన వ్యక్తి మా నాన్న. అయితే చివరి రోజుల్లో క్యాన్సర్ తో బాధపడటం మమ్మల్ని కలిచివేసింది అంటూ కన్నీళ్ల పర్యంతం అయ్యాడు దర్శకుడు వీరశంకర్. పవన్ కళ్యాణ్ తో గుడుంబా శంకర్ , శ్రీకాంత్ తో హలో ఐ లవ్ యు , యువరాజ్యం , విజయరామరాజు , ప్రేమ కోసం , మన కుర్రాళ్లే వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు వీరశంకర్.