టాలీవుడ్ లో మరో విషాదం

Published on Oct 31,2019 10:41 AM
టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది , సీనియర్ నటీమణి గీతాంజలి( 62) ఈరోజు తెల్లవారు ఝామున గుండెపోటుతో మరణించింది. నిన్న అనారోగ్యానికి గురవ్వడంతో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మరోసారి గుండెపోటు రావడంతో మరణించారు గీతాంజలి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో  జన్మించింది గీతాంజలి. ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన సీతారామ కళ్యాణం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యింది గీతాంజలి.

తెలుగు , తమిళ , హిందీ , కన్నడ , మలయాళ బాషలలో పలు చిత్రాల్లో నటించింది గీతాంజలి. ఇటీవలి కాలంలో పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది గీతాంజలి. సీత పాత్రలో మెప్పించిన గీతాంజలి గుండెపోటు తో మరణించడంతో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. గీతాంజలి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసారు.