టాలీవుడ్ లో విషాదం: నటుడు గొల్లపూడి మృతి

Published on Dec 12,2019 04:22 PM
టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీరావు( 80) కొద్దిసేపటి క్రితం చెన్నైలో కన్నుమూశారు. కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు గొల్లపూడి. చెన్నై లోని లైఫ్ లైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గొల్లపూడి ఈరోజు కొద్దిసేపటి క్రితం స్వర్గస్తులయ్యారు. గొల్లపూడి విజయనగరం లో జన్మించారు. 80 ఏళ్ల గొల్లపూడి చిరంజీవి హీరోగా నటించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంతో తెలుగుతెరకు పరిచయం అయ్యాడు గొల్లపూడి. 

మొదటి చిత్రం తర్వాత గొల్లపూడి మళ్లీ తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేకుండాపోయింది. ఆ సినిమా తర్వాత ఏకంగా 290 కి పైగా సినిమాల్లో నటించాడు గొల్లపూడి. విలన్ గానే కాకుండా ఇతర పాత్రల్లో కూడా నటించి ప్రేక్షకులను అలరించాడు గొల్లపూడి. తనదైన డిక్షన్ తో మెప్పించిన గొల్లపూడి రచయితగా కూడా సంచలన విజయాలను అందుకున్నాడు. జర్నలిస్ట్ గా కాలమిస్ట్ గా నటుడిగా, రచయితగా రాణించాడు. గొల్లపూడి కి ముగ్గురు కొడుకులు కాగా అందులో చిన్న కొడుకు సముద్రంలో పడి చనిపోయాడు. చెన్నై లో స్థిరపడినప్పటికి ఎక్కువగా ఉండటానికి ఇష్టపడేది మాత్రం వైజాగ్ , విజయనగరం ప్రాంతాల్లోనే. గొల్లపూడి అకాల మృతికి తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది తెలుగు చిత్ర పరిశ్రమ. గొల్లపూడి అంత్యక్రియలు రేపు చెన్నై లో జరుగనున్నాయి.