నాని - మారుతి కాంబినేషన్ లో మరో సినిమా

Published on Jan 30,2020 03:29 PM

నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ '' భలే భలే మగాడివోయ్ ''. మారుతి దర్శకత్వం వహించిన ఆ చిత్రం మారుతి కెరీర్ లో కూడా బిగ్గెస్ట్ హిట్ అనే చెప్పాలి కట్ చేస్తే ఇన్నాళ్లకు మళ్ళీ ఆ ఇద్దరూ కలిసి సినిమా చేయాలనీ భావిస్తున్నారు. ప్రస్తుతం చర్చలు మాత్రమే సాగుతున్నాయి. కథ నచ్చితే నాని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయం అప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం మారుతి కథని వండే పనిలో ఉన్నాడు.

ఇటీవలే సాయిధరమ్ తేజ్ నటించిన ప్రతి రోజూ పండగే చిత్రంతో మంచి హిట్ కొట్టాడు మారుతి. ఈ సినిమాకు మొదట ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు అలాగే పేరు కూడా కట్ చేస్తే బాక్సాఫీస్ ఖాళీ ని ఈ సినిమా బాగా ఉపయోగించుకుంది దాంతో మంచి వసూళ్లు వచ్చాయి. బయ్యర్లు సేఫ్ కావడంతో హిట్ ప్రాజెక్ట్ అయ్యింది ప్రతి రోజూ పండగే. ఆ సినిమా ఇచ్చిన జోష్ తో నాని తో మళ్ళీ సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు మారుతి.