ఇస్మార్ట్ శంకర్ కాంబినేషన్ లో మరో సినిమా

Published on Nov 10,2019 03:24 PM

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. రామ్ హీరోగా నటించగా నభా నటేష్ , నిధి అగర్వాల్ హీరోయిన్ లుగా నటించారు ఇక ఈ చిత్రాన్ని ఛార్మి నిర్మించింది. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ కావడంతో ఇదే కాంబినేషన్ లో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్ చేయాలా ? లేక ప్రీక్వెల్ చేయాలా ? అనే ఆలోచనలో పడ్డాడట.

ఈ విషయాన్నీ హీరో రామ్ స్వయంగా వెల్లడించాడు. నేను చేస్తున్న'' రెడ్ ''  చిత్రం పూర్తయ్యాక మా కాంబినేషన్ లో సినిమా ఉంటుందని ఇది కన్ఫర్మ్ అని తేల్చేసాడు రామ్. ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన ఊపుతో ఉన్న రామ్ ఆ జోష్ లో మరిన్ని సినిమాలకు రెడీ అవుతున్నాడు. ఇక పూరి జగన్నాధ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ మంచి బూస్ట్ ఇచ్చింది.