అనసూయ కు మరో లక్కీ ఛాన్స్

Published on Dec 06,2019 04:32 PM

హాట్ భామ అనసూయ కు మరో లక్కీ ఛాన్స్ లభించింది. ప్రముఖ దర్శకులు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కనున్న రంగమార్తాండ అనే చిత్రంలో అణసూయ కు మంచి పాత్ర లభించిందట. రంగస్థల నటిగా అనసూయ కనిపించనుందట. మరాఠీ లో విజయం సాధించిన '' నట సామ్రాట్ '' చిత్రాన్ని తెలుగులో '' రంగమార్తాండ '' గా రీమేక్ చేస్తున్నాడు కృష్ణవంశీ. ఇక ఈ చిత్రంలో ప్రధాన జంటగా ప్రకాష్ రాజ్ - రమ్యకృష్ణ నటించనున్నారు.

బిగ్ బాస్ 3 విన్నర్ , సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో అనసూయ ని తాజాగా ఎంపిక చేశారట దర్శకులు కృష్ణవంశీ. అనసూయ బుల్లితెర సంచలనం అన్న విషయం తెలిసిందే. ఇక వెండితెర మీద చాలా సెలక్టివ్ గా సినిమాలను ఎంపిక చేసుకుంటోంది. దాంతో అనసూయ పాత్ర పై అంచనాలు పెంచేలా చేసింది కృష్ణవంశీ చిత్రం.