ప్రభాస్ - రాజమౌళి కాంబినేషన్ లో మరో సినిమా

Published on Feb 05,2020 05:05 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో మరో సినిమా రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఛత్రపతి , బాహుబలి , బాహుబలి 2 చిత్రాలు ఈ కాంబినేషన్ లో రాగా త్వరలోనే నాలుగో సినిమా కూడా రానున్నట్లు సమాచారం. ఈ కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు భారీ విజయాలు సాధించగా బాహుబలి చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళని సాధించి ఒక తెలుగు చిత్రం ప్రపంచ స్థాయిలో ఎలా పోటీ పడగలదో జక్కన్న నిరూపించాడు.

కట్ చేస్తే మరోసారి ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటేలా ప్రభాస్ - రాజమౌళి ల కాంబినేషన్ లో సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. బాహుబలి చిత్రాల తర్వాత ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. అందుకు నిదర్శనమే సాహో. ఈ సినిమా ప్లాప్ అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లని సాధించింది సాహో చిత్రం. ప్రభాస్ కు మరోసారి జక్కన్న తోడైతే ఆ రేంజ్ ఊహించడం కూడా కష్టమే ! ఆ స్థాయి వసూళ్లు రావడం ఖాయం.