విడాకులు తీసుకున్న మరో హీరోయిన్

Published on Feb 28,2020 03:01 PM
బాలీవుడ్ లో విడాకుల పర్వం నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. అదిగో ఫలానా జంట విడిపోయిందట అని అనుకునే లోపు మరో జంట విడాకులకు సిద్ధం అవుతోంది. తాజాగా భాగ్యశ్రీ తన విడాకులపై స్పందించింది. మైనే ప్యార్ కియా చిత్రంతో యావత్ దేశాన్ని ఓ ఊపు ఊపేసిన భామ భాగ్యశ్రీ. ఆ చిత్రంతో భాగ్యశ్రీ కి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. సరిగ్గా అదే సమయంలో హిమాలయని ప్రేమించింది భాగ్యశ్రీ.

దేశమంతా భాగ్యశ్రీ ని ప్రేమిస్తుంటే భాగ్యశ్రీ మాత్రం హిమాలయని ప్రేమించడమే కాకుండా తనకు వచ్చిన క్రేజ్ ని పక్కన పెట్టి పెళ్లి చేసుకొని సంచలనం సృష్టించింది. అయితే ఇన్నాళ్లు వాళ్ళ కాపురం సజావుగానే సాగింది కానీ ఏడాదిన్నర క్రితం ఇద్దరి మధ్య తీవ్ర విబేధాలు రావడంతో విడిపోయారు. నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలా ? లేదా ? అన్న డైలమాలో ఉన్నానని అంటోంది భాగ్యశ్రీ. తాజాగా ఈ భామ ప్రభాస్ తల్లిగా నటించడానికి సిద్ధమైంది.