మరో గిఫ్ట్ ఇచ్చిన బాలయ్య

Published on Nov 10,2019 04:06 PM

నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా రూలర్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 20 న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఇప్పటికే బాలయ్య రకరకాల గెటప్ లలో ఉన్న స్టిల్స్ ని విడుదల చేసింది చిత్ర బృందం. కాగా తాజాగా మరో రెండు స్టిల్స్ ని విడుదల చేసి ఆశ్చర్యానికి గురయ్యేలా చేసారు.

బాలయ్య డిఫరెంట్ గెటప్ లో ఉన్న స్టిల్స్ నందమూరి అభిమానులను విశేషంగా అలరిస్తున్నాయి. ఇందులో బాలయ్య రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అలాగే రిచ్ మ్యాన్ గా కనిపించనున్నాడు. ఈ రెండు గెటప్ లకు మిశ్రమ స్పందన వస్తోంది. ఇక సినిమా పరిస్థితి ఏంటి ? అన్నది డిసెంబర్ 20 న తేలనుంది. త్వరలోనే రూలర్ టీజర్ ని విడుదల చేయనున్నారు