రాజ్ తరుణ్ కు మరో ప్లాప్

Published on Dec 26,2019 02:01 PM

ఉయ్యాలా జంపాల చిత్రంతో హీరోగా పరిచయమైన రాజ్ తరుణ్ కెరీర్ ప్రారంభంలో వరుస విజయాలు అందుకున్నాడు. అయితే గతకొంత కాలంగా వరుస పరాజయాలతో రేసులో లేకుండాపోయాడు. తాజాగా ఈ హీరో నటించిన చిత్రం '' ఇద్దరి లోకం ఒకటే ''. అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం నిన్న విడుదల అయ్యింది. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం పై అటు రాజ్ తరుణ్ ఇటు షాలిని పాండే కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఎందుకంటే ఇది దిల్ రాజు విడుదల చేసిన సినిమా కాబట్టి.

దిల్ రాజు బ్యానర్ లో వచ్చే సినిమా మినిమమ్ గ్యారెంటీ ఉండటంతో తప్పకుండా హిట్ కొడతామన్న ధీమాలో ఉండేవారు కానీ రానురాను ఆ పరిస్థితి తారుమారు అయ్యింది. ఇద్దరి లోకం ఒకటే ప్లాప్ అయి రాజ్ తరుణ్ ఆశలు షాలిని పాండే ఆశలు నీరుగారేలా చేసింది. ఈ సినిమాకు పోటీగా విడుదలైన మత్తు వదలరా చిత్రానికి యునానిమస్ గా హిట్ టాక్ రాగా ఇద్దరి లోకం ఒకటే చిత్రానికి యునానిమస్ గా ప్లాప్ టాక్ వచ్చింది. దాంతో దిల్ రాజు బ్యానర్ కు కూడా కాస్త ఇబ్బందే అని చెప్పాలి. దిల్ రాజు ఎక్కువ చిత్రాలు నిర్మిస్తున్నాడు కానీ విజయాల కంటే అపజయాలే ఎక్కువగా ఎదురౌతున్నాయి.