మళ్ళీ దెబ్బతిన్న రవితేజ

Published on Jan 24,2020 06:25 PM

మాస్ మహారాజ్ రవితేజ మళ్ళీ దెబ్బతిన్నాడు డిస్కో రాజా చిత్రంతో. వి ఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ నటించిన చిత్రం డిస్కో రాజా. రవితేజ విభిన్న పాత్ర పోషించిన ఈ చిత్రంలో హీరోయిన్లుగా పాయల్ రాజ్ పుత్ , నభా నటేష్ లు నటించారు. దాదాపు 20 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగిన ఈ చిత్రం ఈరోజు విడుదల అయ్యింది. సినిమా కాస్త డిఫరెంట్ గానే ఉన్నప్పటికీ మల్టీప్లెక్స్ థియేటర్ ప్రేక్షకులను అలరించేలా మాత్రమే ఉంది.  

అయితే బిసి కేంద్రాల్లోని ప్రేక్షకులకు నచ్చేలా లేకపోవడంతో ఈ సినిమా కూడా పోయినట్లే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. రవితేజ నటించిన చిత్రాలు గతకొంత కాలంగా వరుసగా పరాజయం పొందుతూనే ఉన్నాయి కాకపోతే మధ్యలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన రాజా ది గ్రేట్ చిత్రం మాత్రమే హిట్ అయ్యింది. ఆ సినిమా విజయంతో మళ్ళీ రవితేజ హిట్ బాట పట్టాడు అని అనుకుంటున్న సమయంలో డిస్కో రాజా తో దెబ్బతిన్నాడు మళ్ళీ.