వర్మ మరో వివాదాన్ని రాజేసేలా ఉన్నాడు

Published on Dec 09,2019 12:33 PM

రాంగోపాల్ వర్మ అంటేనే వివాదం తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే చిత్రాన్ని '' అమ్మరాజ్యంలో కడప బిడ్డలు '' గా మార్చాడు. ఈ చిత్రం పలు వివాదాలను సృష్టించి మొత్తానికి ఈనెల 12న విడుదలకు సిద్ధమైంది. సెన్సార్ ప్రాతీయ బోర్డు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో రివైజింగ్ కమిటీ కి వెళ్ళింది. అక్కడ కొన్ని కట్స్ చెప్పి సెన్సార్ క్లియర్ చేసారు. దాంతో ఈ సినిమా 12న విడుదల అవుతోంది.

అయితే ఇక్కడే వర్మ తన పైత్యం చూపించాడు. సెన్సార్ సర్టిఫికెట్ ని కె ఏ పాల్ తనకు ఇచ్చినట్లుగా ఓ మార్ఫింగ్ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వివాదాన్ని మరింత రాజేసేలా ఉన్నాడు. అసలే కె ఏ పాల్ వర్మ మీద చాలా కోపంగా ఉన్నాడు. ఇలాంటి సమయంలో వర్మ మార్ఫింగ్ ఫోటో షేర్ చేసి విడుదల చేస్తే పాల్ మరింత ఆగ్రహం వ్యక్తం చేయడం ఖాయం.