ఆ హీరోయిన్ కు మరో ఛాన్స్ ఇచ్చిన బోయపాటి

Published on Dec 14,2019 05:52 PM

మాస్ దర్శకులు బోయపాటి శ్రీను తాజాగా బాలకృష్ణ తో మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆ సినిమా ప్రారంభమైంది. ఇక ఆ సినిమాలో బాలయ్య సరసన నటించే ఛాన్స్ కేథరిన్ ట్రెసా కు ఇచ్చాడట దర్శకులు బోయపాటి. ఇంతకుముందు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన జయ జానకి నాయక చిత్రంలో అలాగే సరైనోడు అనే చిత్రంలో నటించింది. సరైనోడు చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించింది కేథరిన్ , ఆ తర్వాత జయ జానకి నాయక చిత్రంలో ఐటెం సాంగ్ చేసింది కట్ చేస్తే ఇప్పుడు మరో ఛాన్స్ ఇచ్చాడు బోయపాటి.

బాలయ్య సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ లభించింది కేథరిన్ కు. అయితే ఈ హాట్ భామకు పెద్దగా ఛాన్స్ లు లేకుండాపోయాయి. ప్రస్తుతం ఈ భామ నటిస్తున్న ఒకే ఒక చిత్రం '' వరల్డ్ ఫేమస్ లవర్ ''. విజయ్ దేవరకొండ హీరో కాగా ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్ లు కాగా వాళ్లలో ఒక హీరోయిన్ గా నటిస్తోంది కేథరిన్. వరుసగా తన సినిమాలో ఛాన్స్ ఇస్తున్న బోయపాటి మరోసారి కేథరిన్ కు ఛాన్స్ ఇస్తున్నాడు దాంతో గుసగుసలు మొదలయ్యాయి.