వన్ అండ్ ఓన్లీ సౌత్ ఇండియా స్టార్ మహేష్ బాబు

Published on Jan 26,2020 04:16 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ఓవర్ సీస్ లో మంచి వసూళ్లు సాధిస్తూ రెండున్నర మిలియన్ డాలర్లని దాటేసింది దాంతో ఓవర్ సీస్ లో 1 మిలియన్ డాలర్లకు పైగా వసూల్ చేసిన చిత్రాలు ఉన్న ఏకైక హీరోగా మహేష్ బాబు అవతరించాడు. ఓవర్ సీస్ లో దక్షిణ భారతదేశం నుండి 10 చిత్రాలు భారీ వసూళ్లు సాధించిన హీరోలు ఎవరూ లేరు ఒక్క మహేష్ బాబు తప్ప.

సౌత్ సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ , విజయ్ , అజిత్ , పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ , చరణ్ , అల్లు అర్జున్ , మమ్ముట్టి , ఇలా ఏ భాషలో ఏ హీరోని తీసుకున్నా 1 మిలియన్ డాలర్లకు పైగా వసూల్ చేసిన 10 చిత్రాలు కలిగిన హీరో ఒక్క మహేష్ బాబు మాత్రమే ! దాంతో సౌత్ నుండి అత్యధికంగా 10 చిత్రాలు కలిగిన హీరోగా మహేష్ చరిత్ర సృష్టించాడు. అంతేకాదు ఓవర్ సీస్ లో టాప్ టెన్ జాబితా విడుదల చేస్తే అందులో కూడా మహేష్ బాబు నటించిన మూడు చిత్రాలు ఉండటం విశేషం. భరత్ అనే నేను , మహర్షి , సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో టాప్ టెన్ లో చోటు కూడా సాధించాడు మహేష్.