ఓంకార్ ని దెబ్బకొట్టిన రాజుగారి గది 3

Published on Oct 21,2019 04:52 PM
బుల్లితెర అన్నయ్య ఓంకార్ ని దెబ్బకొట్టింది రాజుగారి గది 3 . రాజుగారి గది హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా రాజుగారి గది 2 తీసాడు. అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషించగా సమంత , సీరత్ కపూర్ , వెన్నెల కిషోర్ , రావు రమేష్ , అశ్విన్ తదితరులు నటించిన ఆ సినిమా అంతగా ఆడలేదు అయినప్పటికీ రాజుగారి గది 3 అంటూ మళ్ళీ తన తమ్ముడు అశ్విన్ బాబు ని హీరోగా పెట్టి తీసాడు ఓంకార్.
ఈసారి బయటి నిర్మాతలు ఎవరూ లేదు దాంతో తానే స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 18 న విడుదలైన రాజుగారి గది 3 డిజాస్టర్ అయ్యింది దాంతో భారీ దెబ్బే తగులుతోంది ఓంకార్ కు . కాకపోతే గుడ్డిలో మెల్ల ఏంటంటే ఓంకార్ కు ఓ ఛానల్ వాళ్లతో చాలా మంచి రిలేషన్ ఉంది దాంతో శాటిలైట్ రైట్స్ రూపంలో కొంత మొత్తం అయితే వస్తుంది కానీ ఓవరాల్ గా రాజుగారి గది 3 మాత్రం ఆర్ధికంగా ఓంకార్ ని దెబ్బేసినట్లే !