పాపం ! అప్పులపాలైన అగ్ర నిర్మాత

Published on Feb 22,2020 02:05 PM

ఒకప్పుడు సంచలన చిత్రాలను తీసిన అగ్ర నిర్మాత ఇటీవల చేసిన సినిమాలతో అప్పుల పాలయ్యాడట. తెలుగు చిత్ర రంగంలో పలువురు స్టార్ హీరోలతో సినిమాలను నిర్మించిన ఈ స్టార్ ప్రొడ్యూసర్ భారీ హిట్ లను చవిచూశాడు. తెలుగు సినిమా రంగానికి 80 - 90 వ దశకంలో సంచలన చిత్రాలను అందించిన ఘనత ఈ అగ్ర నిర్మాతది. అయితే రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కాబట్టి గ్రహచారం తిరగబడింది పాపం.

దాంతో అప్పుల పాలయ్యాడని గుసగుసలు వినిపిస్తున్నాయి ఫిలిం నగర్ లో. తాజాగా ఓ క్రేజీ హీరో తో భారీ బడ్జెట్ తో ఓ సినిమా చేసాడు అది దారుణంగా దెబ్బ కొట్టింది. ఆ సినిమా వల్ల ఏకంగా 15 నుండి 20 కోట్ల మధ్య నష్టం వస్తోందట. అలాగే అంతకుముందు నిర్మించిన  మూడు, నాలుగు  చిత్రాలు కూడా దారుణంగా ప్లాప్ అయ్యాయి దాంతో అన్నీ అప్పులను మిగిల్చాయని అంటున్నారు. ఈ నిర్మాత గొప్పతనం ఏంటంటే సినిమా ప్లాప్ అయినా సరే నటీనటులకు , సాంకేతిక నిపుణులకు ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టకుండా ఇస్తాడని పేరుంది.