పాపం !హెబ్బా పటేల్

Published on Feb 24,2020 08:12 PM

పాపం ! హెబ్బా పటేల్ ఇలా చేయడం ఏంటి ? అని ముక్కున వేలేసుకుంటున్నారు ప్రేక్షకులు. కుమారి 21 ఎఫ్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి హాట్ భామ గా పేరు తెచ్చుకున్న ఈ భామ తాజాగా భీష్మ చిత్రంలో వ్యాంప్ క్యారెక్టర్ పోషించి షాక్ అయ్యేలా చేసింది. నితిన్ - రష్మిక మందన్న జంటగా నటించిన భీష్మ చిత్రంలో అశ్లీలమైన పాత్రలో నటించింది హెబ్బా పటేల్.

అసలే అశ్లీలమైన పాత్ర ఆపై మరింత అశ్లీలకరంగా నటించి కళ్ళు బైర్లు కమ్మేలా చేసింది హెబ్బా పటేల్. ప్రాధాన్యత ఉన్న పాత్ర చేస్తే ఫరవాలేదు లేదంటే స్పెషల్ అప్పియరెన్స్ పేరుతో చిన్న పాత్ర చేసినా బాగానే ఉండేది కానీ వ్యాంప్ పాత్ర ని ఎలా ఒప్పుకుందా ? అని షాక్ అవుతున్నారు హెబ్బా పటేల్ ని అభిమానించే వారు. గ్లామర్ తో అలరించిన ఈ భామ ఇప్పుడు వ్యాంప్ స్థాయికి పడిపోయింది భీష్మ చిత్రంతో.