"ఓ మనిషి నీవు ఎవరు..?"

Published on Mar 05,2019 11:51 AM

స్వర్ణ క్రియేషన్స్ పతాకంపై రిజ్వాన్ కలసిన్ ప్రధాన పాత్రలో స్వర్ణ కుమారి దొండపాటి నిర్మాతగా కృష్ణ మూర్తి రాజ్ కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం "ఓ మనిషి నీవు ఎవరు..?". ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుపుకుని మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని విజయవాడ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. 

 ఈ సందర్బంగా దర్శకుడు మూర్తి రాజ్ కుమార్ మాట్లాడుతూ. మా చిత్రం "ఓ మనిషి నీవు ఎవరు..?" చిత్రం మొదటి షెడ్యూల్ హైదరాబాద్  లో రిజ్వాన్ కలసిన్, సుమన్, చలపతిరావు జూ,, రేలంగి, బి. హెచ్. ఇ. ఎల్. ప్రసాద్, జెన్నీ లపైన కీలక సన్నివేశాలు చిత్రికరించాము. రెండవ షెడ్యూల్  విజయవాడ పరిసర ప్రాంతాలలో చిత్రికరణతో షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ లో చిత్రన్ని విడుదలకు సన్నాహాలు చెస్తున్నాము. అని తెలిపారు

ప్రొడ్యూసర్ స్వర్ణ కుమారి దొండపాటి  మాట్లాడుతూ మా చిత్రం మొదటి షెడ్యూల్  రాజ్ కుమార్ గారు అనుకున్న దానికంటే బాగా ఔట్ ఫుట్ ఇవ్వడం చాలా సంతోషం గా ఉంది. 

"ఓ మనిషి నీవు ఎవరు..?' మూవీ ఆడియో త్వరలో పూర్తి చేసుకుని చిత్రాన్ని గుడ్ ఫ్రైడే రోజు తెలుగు ,హిందీ, తమిళ్ ,ఇంగ్లీష్ ,నాలుగు భాషల్లో ఒకేసారి విడుదలకు సన్నాహాలు చేస్తున్నాము. అని తెలిపారు.