ఎన్టీఆర్ యమదొంగ తమిళ పోస్టర్

Published on Nov 25,2019 03:44 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటించిన చిత్రం '' యమదొంగ ''. 2007 లో విడుదలైన ఈ చిత్రం ఇన్నాళ్లకు తమిళంలో ''విజేయన్ '' పేరుతో డబ్ అవుతోంది. ఇన్నాళ్లు ఆ సినిమాని ఎవరూ తమిళ్ లో డబ్బింగ్ చేయలేదు కానీ బాహుబలి తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి పేరు ప్రఖ్యాతులు ప్రపంచ వ్యాప్తం అయ్యాయి దాంతో ఇప్పుడు ఆ చిత్రాన్ని తమిళంలో విడుదల చేస్తున్నారు.

విజేయన్ పేరుతో డబ్ అవుతున్న ఈ చిత్ర పోస్టర్ లు తమిళనాట అలాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యముడితో మానవుడు జరిపిన పోరాట ఇత్రివృత్తంతో తెరకెక్కిన యమదొంగ ఇక్కడ సూపర్ హిట్ అయ్యింది. అలాగే తెలుగులోలాగే తమిళ్ లో కూడా మంచి హిట్ అవుతుందని భావిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటించగా ఐటెం సాంగ్ లో నర్తించిన రంభ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. అలాగే మోహన్ బాబు , మమతా మోహన్ దాస్ , కుష్భు , అర్చన , ప్రీతి జింగ్యానీయ, నవనీత్ కౌర్ , అలీ , బ్రహ్మానందం తదితరులు నటించారు.