జనవరి 3 న ఎన్టీఆర్ యమదొంగ

Published on Dec 27,2019 01:42 PM

జూనియర్ ఎన్టీఆర్ నటించిన యమదొంగ చిత్రాన్ని తమిళంలో విజయన్ గా డబ్బింగ్ చేసారు. ఇక ఆ చిత్రాన్ని కొత్త ఏడాది కానుకగా 2020 జనవరి 3 న తమిళనాట విడుదల చేస్తున్నారు. 2007 లో యమదొంగ చిత్రం విడుదల అయ్యింది అంటే 13 ఏళ్ల క్రితం అన్నమాట ! 13 ఏళ్ల తర్వాత తమిళంలో ఈ సినిమాని ఎందుకు డబ్ చేసి విడుదల చేస్తున్నారో తెలుసా ? ఎస్ ఎస్ రాజమౌళి కున్న క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి. అవును బాహుబలి తర్వాత రాజమౌళి ఖ్యాతి అనూహ్యంగా ప్రపంచ వ్యాప్తం అయ్యింది దాంతో జక్కన్న దర్శకత్వం వహించిన యమదొంగ చిత్రాన్ని తమిళ్ లో డబ్ చేస్తున్నారు.

యాక్షన్ తో పాటుగా ఎంటర్ టైన్ మెంట్ కూడా పుష్కలంగా ఉన్న ఈ సినిమాలో తమిళ నటి ఫైర్ బ్రాండ్ కుష్భు నటించడం విశేషం. యముడి భార్య పాత్రలో కొద్దిసేపు కుష్భు కనిపించనుంది ఈ చిత్రంలో. అలాగే ప్రియమణి , మోహన్ బాబు తదితరులు కూడా నటించారు. జూనియర్ ఎన్టీఆర్ - రాజమౌళి కాంబినేషన్ లో మూడు చిత్రాలు రాగా మూడు కూడా సూపర్ హిట్ అయ్యాయి. దాంతో ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు .